బంగారుపాళ్యం మార్చి 1 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో మార్చి రెండవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రంజాన్ పండుగ సందర్భంగా, మండలంలోని 10 మసీదులకు చుట్టుపక్కల మసీదులకు వేసవికాలం సందర్భంగా నీటి కొరత ఎక్కువగా ఉండటంతో నీటి ట్యాంకర్ల ద్వారా తమకు నీటి వసతి కల్పించాలని శనివారం మండల కార్యాలయంలోని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్ కు బంగారుపాలెం మండలం ముస్లిం సోదరులు వినతిపత్రం అందజేశారు. మసీదులలో సెహరీ, ఇఫ్టీయారీలు చేసుకోనున్న సందర్భంలో, తాము ఉపవాసాలు ఉన్న నేపథ్యంలో, నీటి వసతి కల్పించాలని, ప్రతి మసీదుకు ఒక ఉచిత నీటి ట్యాంకు సౌకర్యం కల్పించాలని,24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్పించాలని మండల ముస్లిం సోదరులు అందరూ కలసి శనివారం ఇంచార్జ్ ఎంపీడీవో శ్రీధర్ కు మండల కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఇంచార్జి ఎంపీడీవో శ్రీధర్ తగు చర్యలు తీసుకోనున్నట్లు వారికి తెలియజేయడం జరిగింది