మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత నేత్రవైద్య శిబిరం ఏర్పాటు చేశారు.మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు,అడ్డూరి కోటేశ్వరరావు స్థానిక కూటమి నాయకులు శ్రీధర్, ఈశ్వరుడు,వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావులతో కలిసి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.డాక్టర్లు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు,చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు.పలువురు మహిళలు వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలనుకొనియాడారు.ఈసందర్భముగా అద్యక్షులు మైరాల నాగేశ్వరరావు, మాట్లాడుతూ నేత్ర వైద్య శిబిరాలు మండల పరిధిలో ప్రతీ గ్రామంలో నిర్వహిస్తున్నామని,దానిలో భాగంగా గురువారం లింగంపర్తి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సుమారు వందమంది కంటి పరీక్షలు చేయించుకోగా 25 మందికి కంటి శుక్లాలు ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి బుద్ధుడు ఆస్పత్రికి పంపించడం జరుగుతుందని తెలిపారు.అత్యవసర సమయాల్లో ఎవ్వరికీ బ్లడ్ అవసరం వచ్చినా ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని అన్నారు.తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి వివేకానంద సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవాసమితి కార్యదర్శి కడలి సత్యనారాయణ,సభ్యులు సారాశ్రీను, వెలుగుల సూరిబాబు,గొంతురెడ్డి బుజ్జి,కర్రి బాబులు,నరసారావు చిక్కాలఅబ్బాయి,వైద్యులు,తదితరులు పాల్గొన్నారు.