అబ్దుల్లాపూర్మెట్టు , మన న్యూస్
సోమవారం ఉదయం పాలకవర్గం అధికారులతో కలిసి బాటసింగారం పండ్ల మార్కెట్ లో నడుస్తున్న క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…మార్కెట్ లో ఉన్న ప్రతి వర్తకుడి అమ్మకాలను తనిఖీ చేసి కొనుగోలుదారులకు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పాలకవర్గం.
ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…..గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన వ్యాపారులు రోడ్డున పడ్డారని…వ్యాపారం సరిగ్గా లేక వర్తకులు చాలా నష్టపోయారని అన్నారు..గౌరవ ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని..కొహెడ లో నూతన మార్కెట్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.నూతన పాలకవర్గం సహకారంతో రైతులకు న్యాయం చేస్తామని..వచ్చే మామిడి సీజన్ లో రైతులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు పై స్థాయి అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తో ముందుకు వెళ్తామని అన్నారు.ఎక్కువ కమిషన్ తీసుకునే వర్తకులపై చర్యలు తప్పవని అన్నారు.రైతు శ్రేయాస్సే మాకు ముఖ్యమని అన్నారు.అధికారులు..వర్తకులు..కొనుగోలుదారులు..రైతులు..పాలకవర్గంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బాస్కర చారి…మార్కెట్ డైరక్టర్లు జైపాల్ రెడ్డి ..అంజయ్య..మేకం లక్ష్మి..మచ్చేందర్ రెడ్డి..రఘుపతి రెడ్డి…గణేష్ నాయక్ .నరసింహ..గోవర్ధన్ రెడ్డి..వెంకట్ గుప్తా.ఇబ్రహీం..ప్తో పాటు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.