మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం ముగిసిన అఖండ హరినామ సప్తాహా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.శనివారం ఉదయం బాజా భజంత్రీలతో మహిళలు నిండు కలుషాలతో వెంట రాగా విటలేషుని పల్లకి సేవ శోభ యాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.అడుగడుగున భక్తులు పల్లకి సేవకు భక్తి ప్రవక్తులతో నిండుకడువ నీళ్ళు,పసుపు,కుంకుమ అగరవత్తులు,టెంకాయలు,మంగళ హారతులతో పూజలు చేశారు.అనంతరం వెంకట్ రావ్ దేశాయ్ మహారాజ్ దేగుల్వాడి కాల కీర్తన చేశారు.శ్రీ కృష్ణుడి లీలలు వివరించారు.ఆధ్యాత్మిక బోధనలు చేశారు.కీర్తన ముగిసిన తరువాత శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో కీర్తన మహారాజ్ కు నూతన వస్త్రాలు అందించారు.
కాలకీర్తన ప్రసాదాన్ని ధనిక, పేద,మహిళలు,పురుషులు అని భేదభావంలు లేకుండా ఒకరికొకరు ఇచ్చుకొని పాదాభివందనాలు చేసుకున్నారు.అఖండ హరినామ సప్తాహా నిర్వాహకులు కీర్తన కారులు,గాయకులు,తబలా మాస్టర్ లు,సంగీత వాయిద్యకారులు,భజన మండలి సభ్యులకు సత్కరించి కానుకలు అందించారు.ఈ కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు,భక్తులు,భజన మండలి సభ్యులుపాల్గొన్నారు.అనంతరం అందరికీ అన్న ప్రసాదం అందించారు.