బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్
బంగారుపాళ్యం మండలంలోని విజయవాడ శ్రీ చైతన్య అకాడమిక్ ఆధ్వర్యంలో ఉన్న ఉషోదయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆధ్వర్యంలో తుంబ కుప్పం పీ హెచ్ సి వైద్యాధికారి లోహిత్ చెంగల్ రాయ పాల్గొని సైన్స్ ప్రదర్శనశాలను ప్రారంభించడం జరిగింది. అనంతరం పాఠశాల ఏజీఎం సురేష్ మాట్లాడుతూ గుండె ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్ (సి.వి. రామన్) ఎఫెక్ట్ కనుక్కొని భౌతిక శాస్త్రవేత్తంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని సాధించారని ఆయన కొనియాడారు. భారత ఖ్యాతిని నలువైపులా విస్తరించారని అన్నారు .అదే స్ఫూర్తితో ప్రతి ఏటా ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవం జరుపుకొని విద్యార్థులు తయారుచేసిన వివిధ నమూనాల మోడల్స్ ను ప్రదర్శించడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ఉంచిన సైన్స్ ప్రదర్శనశాలను సందర్శించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.