బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్
బంగారుపాళ్యం మండలానికి చెందిన ఈశ్వర్ కళ్యాణ్ అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొగిలీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించే రథోత్సవ కార్యక్రమానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలియజేశారు. బంగారుపాళ్యం మండలానికి చెందిన ఎన్నారై కళ్యాణ్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ద్వారా రథోత్సవానికి పలమనేరు,బంగారుపాల్యం తదితర ప్రాంతాల మీదుగా భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.ఈశ్వర్ కళ్యాణ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రథోత్సవానికి విచ్చేసే భక్తులు తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు.