మనన్యూస్,గొల్లప్రోలు:మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజా కార్యక్రమాలు అన్న సమారాధన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు
సోదరులు స్వామివారికి అమ్మవారికి పూజా క్రతువులు నిర్వహించి 1100 కేజీల బియ్యం వండిన అన్నముతో
అన్న సమారాధన నిర్వహించారు స్వామివారికి రజత ,స్వర్ణ ఆభరణములతో అలంకరణ చేయడం విశేషం.ఆలయ సేవా సభ్యులు మాట్లాడుతూ గ్రామశాంతి,
అన్న శాంతి జరగాలని
ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలియజేశారు.