మనన్యూస్,పినపాక:మండలం లోని సీతం పేట గ్రామం లో మహా శివరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని శుక్రవారం ఆలయం లో బండారు బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమo లో సీఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మహా అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.స్థానికుల తో పాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ అద్దంకి నరేష్,ఎంపీడీవో సునీల్ కుమార్,ఎంపిఓ వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.