మనన్యూస్,నారాయణ పేట:అక్రమ కట్టడాలపై సమస్య పరిష్కారమయ్యేంత వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన శిబిరం కొనసాగుతుందని జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బాబా కాలనీలోని టీఎన్జీవో ఆఫీస్ పక్కన 20 ఫీట్ల రోడ్డుకు నిబంధనలకు విరుద్ధంగా,పర్మిషన్ లేకుండా అడ్డంగా దౌర్జన్యంగా నిర్మిస్తున్న కట్టడాన్ని ఆపాలని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కమిషనర్ డిపిఓ కలెక్టర్ గారికి విన్నవించినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కబ్జాదారులకు సహకరిస్తున్న కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మకూరులో వెలసిన అనేక వెంచర్లలో 10 శాతం భూమి వివరాలు ఆర్టిఐ ఆక్ట్ ప్రకారం అడిగిన రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు స్పందించకపోవడం ఏంటని ధ్వజమెత్తారు. 20 ఫీట్ల రోడ్డు భూమి అన్యాక్రాంతమైందని వాపోయారు. ఈ కార్యక్రమానికి కలిసి వచ్చే లౌకిక శక్తులు ప్రజా సంఘాలు దళిత సంఘాలు కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అబ్రహం, భాస్కర్,శ్యాంసుందర్, రవీందర్, సీఎన్ శెట్టి, ఎండి కుతుబ్, లక్ష్మీనారాయణ, బాలస్వామి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి గీతమ్మ ,కృష్ణవేణి, భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.