మనన్యూస్,కర్మన్ ఘాట్:మహా శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని శ్రీ.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో నెలకొన్న ముడు శివాలయంల లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు కనువిందు చేసే విధంగా చిన్నారి కళాకారులచే సంగీత నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలను ఆసక్తిగా ఆలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కార్యనిర్వహణాధికారి యన్. లవణ్య పర్యవేక్షణలో దేవస్థానము ద్వారా చలువ వందిరులు వేసి, మంచి నీరు, ఉపవాస దీక్షలో యున్న భక్తులకు పండ్లు, ఉచిత ప్రసాదములు అందచేయడం జరిగినది. రాత్రి 10.0 ని.లకు మహాన్యాస రుద్రాభిషేకములు, రాత్రి 1.30 ని.లకు నిర్వహించబడిన శ్రీ శివ పార్వతుల కళ్యాణములకు అధిక సంఖ్యలో
భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అర్చనలు, అభిషేకముల వద్ద భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఈఓ లావణ్య అర్చక, సిబ్బంది కి ప్రత్యేక సూచనలుచేశారు. అలాగె
భక్తులు విశేషంగా దర్శించుకొని పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, దేవాలయం భక్తులతో కిటకిటలాడడం సంతోషాన్ని కల్గించిందన్నారు