మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గల మహాంతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠంలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.సద్గురు మహాంతప్ప ,బస్వలింగప్ప మూర్తులకు శిష్యులు పూజలు చేశారు.బాజా భజంత్రీలు వేద మంత్రాలతో శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పల్లకి సేవ,ఊరేగింపు పాపేశ్వర మందిరం,ఆంజనేయస్వామి మందిరం దర్శనం చేసుకుని మఠంనకు చేరుకుంది.అనంతరం మఠంలో భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారు. మల్లికార్జున శివాచార్యులు కత్ గాంవ్,మహాదేవ్ స్వామి గుడిమెట్ వారు,శివానంద స్వామి చించేలి,మల్లికార్జున స్వామి కౌలాస్ వారు భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమాకాంత్ దేశాయ్, వీరేశం పటేల్,మల్లప్ప పటేల్,వినయ్ పటేల్,కాశీనాథ్ సార్,గంగారాం సార్,భూంశెట్టి పటేల్,వీర్ సంగప్ప దేశాయ్, గూలే రాజప్ప, గూ లే బసప్ప,సిందోల్ బసప్ప, బసప్ప స్వామి,తదితరులు పాల్గొన్నారు.