మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలేరు నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.ఏలేశ్వరం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒకటి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద,రెండవది పల్లపు వీధి రామాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాలను అర్బన్ హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులకు అవసరమైన మేరకు వైద్య సేవలు అందించేందుకు రెండు వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఇందులో ప్రాథమిక చికిత్స అందించడం అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఉండేందుకే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ వైద్య శిబిరాల్లో ఏఎన్ఎంలు కె రాజ్యలక్ష్మి, కె వరలక్ష్మి, రాజేశ్వరి,రమాదేవి,లక్ష్మి దేవి,లోవాలక్ష్మి, చిన్నామ్ములు, నూకరత్నం ,ఆశాలు గంగాభవాని,కె వరలక్ష్మి తదితర వైద్య సిబ్బంది భక్తులకు వైద్య సౌకర్యాలు అందించారు.