మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండోవ కాశీగా వీరాజీలుతున్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు వేకువజాము నుంచి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ఆశేష భక్త సందోహం పుణ్యస్నాన
మాచరించడంతో పవిత్ర 'ఏలానది'లో పుణ్యస్నానం ఆచరించి అనంతరం స్వామీ, అమ్మ వార్లను దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణం మొత్తం యాత్రికులు చేసిన శివనామస్మరణతో మారుమోగింది.
ఆలయ ప్రధాన అర్చకులు శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పుణ్య స్థానాలు చేసే చోట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఎటువంటి సంఘటనలు జరగకుండా నిలువరించేందుకు గజఈతగాళ్లు బృందం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చేపట్టారు. ఆలయానికి వచ్చే పలు మార్గాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ఉచితంగా పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు.