మనన్యూస్,గొల్ల ప్రోలు:చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు చార్టర్ బోక్సెస్ క్షబ్ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బుర్రా అనురాధ చేతులు మీదుగా మంగళవారం నిర్వహించారు.కళాశాల నందలి విద్యార్థులలో విభిన్న రంగాల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసి వారిలో దాగివున్న సృజనాత్మకను ప్రదర్శించేందుకు ఈ చార్టర్ బోక్సెస్ క్షబ్ ఉపయోగపడుతుందని క్లబ్ కన్వీనర్ శ్రీమంతుల రవికిరణ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లాడుతూ.. విద్యార్థులంతా చార్టర్ బోక్సెస్ క్షబ్ లో చేరి మరింత నైపుణ్యాన్ని సంబంధించి ఉద్యోగావకాశాలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అఖిలేష్, బీటెక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శ్రీనివాసరావు, డిప్లొమా ప్రిన్సిపల్ డాక్టర్ వైవిఎన్ రాజశేఖర్, అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.