మనన్యూస్,గొల్లప్రోలు:జై వాసవి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ కపుల్స్ మరియు గొల్లప్రోలు మండల ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి గొల్లపూడి ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో గొల్లప్రోలు మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద సుమారు 5000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది సుమారు 20 సంవత్సరాల నుండి శ్రీ షిరిడి సాయి గొల్లపూడి ట్రస్ట్ వారు ఈ ఆర్థిక సహాయని అందిస్తున్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ జోన్ చైర్మన్ విజిట్ కూడా చేయడం జరిగింది వాసవి క్లబ్ కపుల్స్ గొల్లప్రోలు జోన్ చైర్మన్ శ్రీ కేదార్శెట్టి చలపతిరావు సవినయంగా ఆహ్వానించి వారిచే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి వారిని సత్కరించినారు వాసవి క్లబ్ సెక్రటరీ అయినా పెరాట్ల శివ గణేష్ పుట్టినరోజు సందర్భంగా వారిచే కేక్ కటింగ్ కూడా చేయించి వారిని కూడా సత్కరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కుసుమంచి పాపారావు ప్రెసిడెంట్ ఊర సుబ్బారావు శివ గణేష్ సూర్యనారాయణ గొల్లపూడి భాస్కర్ రావు తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ వైస్ ప్రెసిడెంట్ సాయి చలమయ్య గారు దంగేటి శ్రీ రామకృష్ణ నేటి చంటిబాబు కేదారి శెట్టి నానాజీ పాపయ్య రాజా కేదర్శెట్టి కృష్ణ జానకి బాబు దంగేటి సత్యనారాయణమూర్తి ఊడ మురళి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.