మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని సర్పోని చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ పరిశీలించారు.అనంతరం మాస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా టీఏ కూలీలతో మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట ఉపాధి హామీ కూలీలు త్వరగా పనులు చేసుకుని ముగించుకొని వెళ్లాలని కూలీలకు సూచించారు. ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు పడద్దని తెలియజేశారు. కొలతల ప్రకారం పనులు చేయాలని అన్నారు. కూలీలకు నీడ నీరు వసతి ఏర్పాటు చేయాలని టిఏ దృష్టికి కూలీలు తీసుకువెళ్లారు త్వరలో నీడ ఏర్పాటు చేసే విధంగా చర్య తీసుకుంటామని ఆయన అన్నారు.టీఏ వెంట ఫీల్డ్ అసిస్టెంట్ క్యాస బాలరాజు తదితరులు ఉన్నారు.