మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మంగళవారం నాడు మండలంలోని మర్రివీడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధిశాఖ,పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏలేశ్వరం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.వరలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.వరలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా నిర్వహించిన ఈ శిబిరంలో 42 పశువులకు చూడి పరీక్ష నిర్వహించామని,ఎదుకురాని పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స నిర్వహించామని,20 పేయి దూడలకు బ్రూసెల్లా వ్యాక్సిన్ వేశామని,300 పశువులకు గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలు వేశామని ఆమె తెలిపారు.ప్రత్తిపాడు సహాయ సంచాలకులు డాక్టర్.చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ మాట్లాడుతూ రైతులందరూ ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శస్త్ర చికిత్స సహాయకులు డాక్టర్.మంజూష,పశు వైద్య సిబ్బంది జీవివి సత్యనారాయణ,ఏ.లలిత,బాదం ఆనందకుమార్,ఝాన్సీ,గంగాధరం, సీతారాం,కృష్ణ,కామేష్ తదితరులు పాల్గొన్నారు.