భక్తకోటి భక్తులకు దర్శనభాగం కల్పిస్తున్న పార్వతీ పరమేశ్వరులు.
మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బుధవారం హరహర మహాదేవ నామముతో మారుమోగుతున్న పార్వతీ పరమేశ్వరుల శివ నామముతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఎంబి విజయకుమార్, కార్య నిర్వహణ అధికారి మునిరాజు,ఇన్స్పెక్టర్ శరవణ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో స్వయముగా వెలసియున్న శ్రీ మొగిళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగముగా పది రోజులు పాటు జరుగనున్నట్లు కార్య నిర్వహణ అధికారి మునిరాజు తెలిపారు. మండలం ప్రజలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తుల వచ్చే మహిళా భక్తులు బిడ్డలు లేని మహిళలకు ఇక్కడ స్నానము చేసి రాత్రికి జాగారం ఉంటే బిడ్డలు కలుగుతారని మేధావులు తెలిపారు. అమ్మవార్లను పూజిస్తే పార్వతీ పరమేస్వరులకు పూజ చేస్తే వారికి బిడ్డలు కలుగుతారని అప్పటి పురాణంలో తెలిపారు. అందువలన ఎక్కువ సంఖ్యలో భక్తులు మొగిలి క్షేత్రానికి తరలి వస్తుంటారు. చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రమైన శ్రీ మొగిలీశ్వర స్వామి దేవాలయంలో కోరికలను కోరుకుంటే ఏ సమస్యలకైనా పరిష్కారం ఇక్కడ ఉంటుందని,కోరికలను తీరుస్తాయని భక్తులు నమ్మకం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సృష్టికర్త ఆయన విష్ణుమూర్తికి సకల సృష్టికర్త ప్రాణం పోసి సమర్థులైన బ్రహ్మ వాదించే సృష్టికర్త అని తెలియజేశారు. మహాశివరాత్రికి రాత్రి జాగారం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణంలో రచించినట్లు తెలిపారు. మహాశివరాత్రికి బుధవారం భక్తులు అధిక సంఖ్యలో రావచ్చునని ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్చార్జి సుమన,ఈవో మునిరాజులు తెలిపారు