మనన్యూస్,బంగారు పాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం,ఎన్ కోటూరు గ్రామానికి చెందిన బి.చిట్టెమ్మ, వయస్సు-55 సంవత్సరాలు,(భర్త) బి.సదాశివయ్య,
కులం ఎస్సీ మాల,వృత్తి కూలి ఈమె 25.02.2025 వ తేదీ మంగళవారం అదే గ్రామానికి చెందిన సురేంద్రబాబు వ్యవసాయ పొలంలో వరి ఫైరుకు కలుపుతీస్తూ ఉండగా,పొలం పక్కన ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ కు అల్లుకొని ఉన్న పచ్చటి తీగలు ఇనుప ఫెన్సింగ్ పై వుండగా వాటిని సదరు ఫెన్సింగ్ కమ్మి చిట్టెమ్మ చేతికి తగిలి కుడిచేయి కాలిపోయి ఆమె చనిపోవడం జరిగింది. తన భర్త సదాశివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ కే.మురళి బాబు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.