మనన్యూస్,నారాయణ పేట:క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో బంగారు పథకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్రీడాకారులకు తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన జాతీయ 16వ బాలుర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర మీట్ జావలిన్ త్రోలో సందీప్ బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ సన్మానించారు.అలాగే హై జంప్ లో ప్రవీణ్ మూడవ స్థానం,తెలంగాణ చత్రపతి శివాజీ కేసరిలో రెజ్లింగ్ పోటీలలో మొదటి బహుమతి సాధించిన నాగలక్ష్మినీ జిల్లా కలెక్టర్ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శెట్టి వెంకటేష్,కోచ్ హారిక,శ్రీనివాస్ పిడి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.