విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ప్రతిభా పరీక్షలు దోహదపడతాయి
విద్యార్థులు పరీక్షల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి
మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:మణుగూరు మణుగూరు మండలం,విద్యార్థులలో ప్రతిభని,సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు,ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక ధైర్యాన్ని పెంచుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వరక అజిత్ఏ ఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఈనపల్లి పవన్ సాయి
పిలుపునిచ్చారు మండల కేంద్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లో మొట్ట మొదటి విద్యార్థి సంఘం,స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి, ఎందరినో అత్యున్నత మేధావులుగా తీర్చిదిద్దిన ఏకైక.విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆయన అన్నారు.విద్యారంగ సమస్యల పరిష్కారమైద్వేయంగా ఏఐఎస్ఎఫ్ పనిచేస్తుందని అన్నారు.విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏఐఎస్ఎఫ్ చేస్తున్న కృషిని అందరు అభినందించాలని,జిల్లా వ్యాప్తంగా ఉన్న పదవ తరగతి విద్యార్దులు ఏఐఎస్ఎఫ్ టేలెంట్ టెస్టులో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఉద్యమాలతో పాటు విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ లు పెట్టడంతో వారిలో ఉన్న సృజనాత్మకతను పరీక్షల పైన వారికున్న భయాన్ని పోగొట్టేందుకే జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు ఈ
టెస్ట్ ను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పేపర్‌ను రూపొందించామని ఆయన తెలిపారు. వారి సిలబస్ నుండే 100 మార్కులకు ఆల్ఫాబెట్ రూపంలో అన్ని సబ్జెక్టులు ఈ ప్రశ్న పత్రంలో ఉంటాయని విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మాత్రమే ఈ పరీక్ష పత్రాల్లో ఇస్తామని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అయన కోరారు.ఈ కార్యక్రమంలో.ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఈనపల్లి పవన్ సాయి పినపాక నియోజకవర్గ కార్యదర్శి అక్కినపల్లి నాగేంద్రబాబు,మండల నాయకులు,రాజు,అలోక్,రాము,రఘు,ఆదిత్య,తదితరులు పాల్గొన్నారు