మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:జాతీయ స్థాయి అథ్లెటిక్ క్రీడాకారుడు అపక సతీష్ కు మణుగూరు నేతాజీ వాకర్స్ ఆర్ధికంగా రూ.10వేలు చేయూత అందించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దుమ్ముగూడెం మండలం,మారాయిగూడెం గ్రామానికి చెందిన అపక సతీష్ రాష్ట్ర,జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.గత నెల జనవరి కేరళ కున్నాంకులంలో నిర్వహించిన అల్ ఇండియా సీనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 100,200 మీటర్ల రన్నింగ్ విభాగాల్లో గోల్డ్,లాంగ్ జంప్ విభాగంలో బ్రాంజ్ పతకాలు సాధించాడు.ప్రస్తుతం బెంగుళూరులో జరిగే ఏసియా జాతీయ అథ్లెటిక్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నేతాజీ వాకర్స్ టీమ్ దృష్టికి రావడంతో వారు వెంటనే స్పందించి మణుగూరు లోని శ్రీ భార్గవ ఆటోమొబైల్స్ ఎన్ విజయ భాస్కర్ రెడ్డి,రావులపల్లి రామమూర్తి సారధ్యంలో సోమవారం రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా నేతాజీ వాకర్స్ మాట్లాడుతూ అథ్లెటిక్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి భద్రాద్రి జిల్లాకు,ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు నేతాజీ వాకర్స్ ఎన్ విజయ భాస్కరరెడ్డి, రావులపల్లి రామమూర్తి,తాళ్లపల్లి యాదగిరి గౌడ్,సామ శ్రీనివాస రెడ్డి,కటకం సతీష్,వడ్డాణం రమేష్,మైత్రి శంకర్ రెడ్డి, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు,వాగబోయిన నాగేశ్వరరావు,కొరిమిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.