సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని
జర్నలిస్టు మిత్రులు ఆరోగ్యం పట్ల వహించాలి
మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి
ప్రతి ఒక్కరూ నడక తప్పక అలవర్చుకోవాలి
ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ రెడ్డి
ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే ధ్యేయం
అధ్యక్ష కార్యదర్శులు మురళీ,బాలచంద్ర
మనన్యూస్,తిరుపతి:జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణలో ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుందని హాస్పిటల్ చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని,మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి తెలిపారు.ఆదివారం ప్రెస్ క్లబ్ సభ్యులు,వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణాద్రి వారిచే మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో 224 మంది జర్నలిస్టులు,వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా తినకముందు షుగర్,తిన్న తర్వాత షుగర్,థైరాయిడ్,కొలస్ట్రాలు,ఈసీజీ,పిఎఫ్టి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు అనుక్షణం వార్తల సేకరణలో విలీనమై ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని జర్నలిస్టు మిత్రులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు.వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ టైం కి తినాలని,తగినంత నిద్ర తప్పక కలిగి ఉండాలని సూచించారు.డాక్టర్ సుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నడక తప్పక అలవర్చుకోవాలన్నారు.నడక వలన గుండెపోటుతో పాటు షుగర్,బిపి లాంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా అరికట్టవచ్చని ఆయన తెలిపారు.అంతేకాక మంచి పౌష్టిక ఆహారం కోవాలని,అందులో ఆకుకూరలు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పారు.అనంతరం డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఆస్టర్ నారాయణద్రి ఆసుపత్రిలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.వారి ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రెస్ క్లబ్ అడిగిన వెంటనే మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని,ముందు ముందు మరింత గొప్పగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.తమ ఆసుపత్రిలో రాయలసీమలో ఎక్కడా లేనివిధంగా ఎంతో అదునాతన టెక్నాలజీతో వైద్య సదుపాయాలను తీసుకురావడం జరిగిందన్నారు.మొన్నటికి మొన్న 18 నెలల్లో 100 శాతం విజయవంతంగా 500 గుండె బైపాస్ సర్జరీలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.ఇందులో ఎక్కువ శాతం శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించామని చెప్పడానికి ఆనందిస్తున్నామన్నారు.పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని ఆయన తెలియజేశారు.ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మురళీ,బాలచంద్ర
మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యులు,వారి కుటుంబ సభ్యుల సంక్షేమ ధ్యేయంగా కమిటీ పని చేస్తుందన్నారు.అందులో భాగంగానే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులచే మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అడిగిన వెంటనే ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం మెగా వైద్య శిబిరం నిర్వహించినందుకు ఆస్టల్ నారాయణద్రి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ రెడ్డి, పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రీతమ్,గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిష,జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయిరాం తేజ,అసిస్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తీక్,అసిస్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మధు,ఫిజియోతెరపిస్ట్ డాక్టర్ యశోద్,ఆస్టల్ వాలంటీర్ హెడ్ ఆనంద్, ఆస్టర్ వాలంటరీ ఎగ్జిక్యూటివ్ మౌళి,పవన్,బ్రాండింగ్ రమేష్,నర్సింగ్ సిబ్బంది,ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ విజయ్,మాధవ్,ఈసీ మెంబర్లు పరంధామ,జయశంకర్,సీనియర్ జర్నలిస్టులు,జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.