మనన్యూస్,వనస్థలిపురం:టు వీలర్ మెకానిక్ ఆటోమొబైల్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమావేశం చింతలకుంట లోని ఓక ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ముందుగా గత కొన్ని రోజుల క్రితం నరేష్ అనే వ్యక్తి మరణించిన నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు అందరు కలిసి దాదాపు రెండు లక్షల రూపాయలు వారి యొక్క కుటుంబసభ్యులకు అందజేశారు.దానిలో భాగంగా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారి దృష్టికి పలు సమస్యలు వారి దృష్టికి తీసుకొనిరావడం జరిగింది.దానిలో భాగంగా అసోసియేషన్ కోసం కొంత స్థలం కేటాయించలని కోరారు.హెచ్.బి.సీ.ఎల్.కంపెనీ వారు బి.ఏ.సిక్స్ ట్రెయినింగ్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.అనంతరం సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.అలాగే ఇంకా ఏమి అయిన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి,డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్,అసోసియేషన్ సభ్యులు అరవింద్ రెడ్డి,మెయిన్,నరేందర్ రెడ్డి,ప్రసాద్,దామోదర్ గౌడ్,అజయ్,నర్సింహా యాదవ్,షేక్ షరీఫ్,హెచ్.బి.సీ.ఎల్.కంపెనీ సభ్యులు సురేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.