మన న్యూస్, జగ్గయ్యపేట; సిపిఐ పార్టీ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మీడియా తో మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలో గల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి నవంబర్ 2023 సంవత్సరం నుండి నేటి వరకు కార్యాలయం పరిధిలో గల వివిధ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ స్టాంపుల ద్వారా,రిజిస్ట్రేషన్ చలానాల ద్వారా రావాల్సిన ప్రభుత్వం నిర్దేశించిన సెస్ నగదు అందలేదన్నారు.ఇప్పటికే సంవత్సరం కాలం దాటుతున్న యన్.టి.ఆర్ జిల్లా రిజిస్ట్రార్,విజయవాడ కార్యాలయం నుండి టిడి సెస్ పెండింగ్ అమ్మౌంట్ నగదు విడుదల కాకపోవడంతో ప్రజలకు అందాల్సిన కొన్ని ప్రభుత్వ సేవలు అందడం లేదన్నారు.మేజర్ పంచాయతీలైన చిల్లకల్లు,షేర్ మహమ్మద్ పేట మిగిలిన పంచాయతీలలో భూముల రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరుగుతాయని ఆయన అన్నారు.రిజిస్ట్రేషన్ ల ద్వారా వచ్చే నగదే కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు అందించే పరిస్థితులున్నాయి.యన్.టి.ఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి సెప్టెంబర్ 2024 సంవత్సరం వరకు సెస్ అమ్మౌంట్ అందాయని ఆయన అన్నారు.కాని జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి నవంబర్ 2023 నుండి నేటి వరకు సెస్ పెండింగ్ సమస్య పేరుకుపోయిందని ఆయన విమర్శించారు.దీనితో ప్రజలు,పని చేస్తున్న కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి పంచాయతీలకు నవంబర్ 2023 నుండి నేటి వరకు రావాల్సిన టిడి సెస్ అమ్మౌంట్ ని ప్రభుత్వం విడుదల చేయకపోవడం అంటే జగ్గయ్యపేట ను చిన్న చూపు చూడటం కాదా అని ఆయన ప్రశ్నించారు.సాక్షాత్తు రెవెన్యూ,రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల మంత్రి వర్యులు అనగాని సత్య ప్రసాద్ కి కొందరు సమస్యను మొర్ర పెట్టుకున్న గోడకు చెప్పుకున్నట్లుగానే ఉందని ఆయన అధికారుల తీరును విమర్శించారు.ఈ సంవత్సర కాలంలో ప్రధాన పండగలు వచ్చి జీతాలు అందక కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి కనికరం లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ఇప్పటికైన అధికారులు మొద్దు నిద్ర వీడి మహా శివరాత్రి లోపు టిడి సెస్ పెండింగ్ నగదును విడుదల చేయకపోతే కార్మికులతో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన చేస్తామని ఆయన అన్నారు.