మనన్యూస్,గొల్లప్రోలు:తాను సక్రమంగా విధులు నిర్వహిస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా విధుల నుండి తొలగించారని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన వి ఓఏ యానిమేటర్ చికట్ల కృష్ణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2019 సంవత్సరం నుండి తాను విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.ఇటీవల తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కొద్దిమంది సభ్యులతోనే సమావేశం నిర్వహించి తనను తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తన స్థానంలో ఎటువంటి విద్యార్హత లేని ఒక మహిళను నియమించారని తెలిపారు.ఆమెకు విద్యార్హత లేదని పదవ తరగతి ఫెయిల్ అయ్యారని,నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని మహిళా సంఘాలసభ్యులు తెలియజేసినా ఎ పిఎం సన్యాసిరావు వి ఓఎ గా ఆన్లైన్ చేసి నియమించారని ఆమె వాపోయారు.ఇందుకు సంబంధించి గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ నిర్వహించినట్లు తెలిపారు తగిన విద్యార్హత ఉండి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్న తనను దళిత మహిళ అనే కారణంతో తొలగించారని బోరున విల పించారు.తనను ఆ కారణంగా తొలగించడం పైనా,ఎటువంటి విద్యార్హత లేని వారిని నియమించడం పైనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అధికారులు న్యాయం చేయవలసిందిగా కృష్ణకుమారి కోరారు.ఆ కారణంగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి తమకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న వివో ఏ చీకట్ల కృష్ణకుమారిని అకారణంగా తొలగించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు.ఉద్దేశపూర్వకంగా ఎ పిఎం అర్హత లేనివారిని నియమించారని ఆరోపించారు.వివోఏ గా పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారిని నియమించవలసి ఉండగా పదో తరగతి ఫెయిల్ అయి సరైన సర్టిఫికెట్ లేని మహిళను నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తొలగించిన యానిమేటర్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పిల్లా సూర్యకాంతం,అల్లి కుమారి,దారా ఏసురత్నం,వాసా శాంతి,బొల్లం స్వర్ణలత,బొబ్రాల నాగమణి,దారా పాపారత్నం పిల్ల వేణు నాగమణి తదితరులు డిమాండ్ చేశారు.