మనన్యూస్.తవణంపల్లి:మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అరగొండలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ విలువ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో హరిత రాయబారులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో హరిత రాయబారులు పంచాయతీ పరిధిలోని అరగొండ బీసీ కాలనీ చారాల,పైమాగం తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తడి చెత్త పొడి చెత్తను సేకరించి ఎస్ డబ్ల్యూ బి సి కి తరలించారు.ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మురగేషన్ మాట్లాడుతూ హరిత రాయబారులు ప్రతిరోజు గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తడి చెత్త పొడి చెత్తను సేకరిస్తారని తెలిపారు.ప్రజలు తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా హరిత రాయబారులకు అందించి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఈవోపీఆర్డీ రాఘవేంద్ర రాజు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.