మనన్యూస్,మహేశ్వరం:మండల్ అమీర్ పేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోల్కొండ రాములు అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రి లో చేరగా వైద్య ఖర్చుల కొరకు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్ గారిని సంప్రదించగా కేఏల్ఆర్ గారు వెంటనే స్పందించి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారిచే సీఏం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹150,000 రూపాయల ఎల్ఓసీ LOCభాదితుని కుటుంబ సభ్యునికి కేఏల్ఆర్ గారు అందజేయడం జరిగింది.ఆపద లో ఉన్న వారికి పార్టీలకతీతంగా కేఏల్ఆర్ సేవకుడే నాయకుడు అనే నినాదం తో అదుకుంటున్నాడని ప్రజలు మేచ్చుకుంటున్నారు.ఈ కార్యక్రమం లో మహేశ్వరం మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు గోల్లూరి,కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం,శివ మండల కాంగ్రెస్ నాయుకులు పాల్గొన్నారు.