Mana News, రేణిగుంట ఫిబ్రవరి 22,2025 :-రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీ పరిధిలోని శివాలయం వీధిలో రహదారిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని సదరు గుర్రమ్మ అనే మహిళ శనివారం నాడు మీడియాను ఆశ్రయించింది,వివరాల్లోకి వెళితే కరకంబాడి శివాలయం విధిలోని మంచినీళ్ల ట్యాంక్ పక్కనే 55 సంవత్సరాలుగా నివాసముంటున్న స్థానికరాలు గురమ్మ ఇంటికి వెళ్లే దారిని అధికార బలంతో కబ్జా చేశారని ఆరోపించింది సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన నెల నుండి ఘర్షణలు జరుగుతున్న మాకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు స్థానికంగా ఉన్న వ్యక్తి ఆ దారి స్థలం కోసం మా పై రోజు రచ్చకు వచ్చి దాడి చేస్తున్నానన్నారు .ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేసిన తాసిల్దార్, గ్రామ పంచాయితీ దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి న్యాయం చేయడం లేదన్నారు స్థానికంగా ఉండే వారిని బెదిరిస్తూ మీ వల్ల అయింది చేసుకోండి అంటూ ఇబ్బంది పెడుతున్నరంటూ ఇన్ని సంవత్సరాలుగా రోడ్డు ఉండగా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపట్టడం దౌర్జన్యం అన్నారు అక్కడ మంచి నీటి ట్యాంక్ ,గుడి,కూడా ఉందని దారి లేకుండా చేస్తున్నారన్నారు మేము కూడా ఈ ప్రభుత్వానికి ఓటు వేసాము కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. మాకు సంబంధిత అధికారులు ఎమ్మెల్యే న్యాయం చేయాలని వేడుకున్నారు .