మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని ప్రతి రైతు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బి. జ్యోతి పిలుపునిచ్చారు. మండలంలోని సిరిపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియను శుక్రవారం ఏవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు త్వరితగతిన తమ పేర్లను ఫార్మర్ రిజిస్ట్రీ నందు నమోదు చేయించుకోవాలని, విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందేందుకు చివరి తేదీ ఈ నెల 25 కావున రైతులు త్వరితగతిన మీ భూమి గల గ్రామ రైతు సేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలని ఇప్పటికే ఏలేశ్వరం మండలంలోని 4000 పై చిలుకు రైతులు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందడానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారన్నారు. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందడం ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలను పొందేం దుకు ఇదే అర్హులవుతారని పీఎం కిసాన్, అన్నదాత-సుఖీభవ, వడ్డీ లేని పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, సూక్ష్మ సేద్య పరికరాలు, ఇతర రాయితీ పథకాలు పొందేందుకు దీన్ని ఆధారంగా ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారమవుతుందని ఆమె తెలిపారు.