మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఈ నెల 27 న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలేశ్వరం ఇంచార్జ్ తహసిల్దార్,ఏ ఈ ఆర్ ఓ కె కుశరాజ్ తెలిపారు. మండలంలో 1921 మంది వాటర్లు ఉండగా మూడు బూతు లలో ఎన్నికలు జరుగుతాయి అన్నారు. నెంబర్ 16 వ బూతు ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయం,17 వ బూతు రమణయ్యపేట ఎంపీపీ స్కూల్,18 వ బూతు ఎర్రవరం ఎంపీపీ స్కూల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రతి ఒక్క వాటర్ కు బూత్ నెంబరు, సీరియల్ నెంబర్ తో కూడిన స్లిప్పు లను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.