మనన్యూస్,పినపాక:చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా,అధికారం పోయినా టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడీశాల రామనాథం ఎద్దేవా చేసారు.శుక్రవారం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రామనాథం మాట్లాడారు. సోషల్ మీడియా వేదిక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ గురించి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడని విమర్శించారు.పినపాక నియోజకవర్గంను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పాయం గురించి మాట్లాడే నైతిక అర్హత రేగాకు లేదన్నారు.కెసిఆర్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు,దౌర్జన్యాలు,ఇసుక మాఫియా,దళితబందు దగా,మూడేకరాలు భూమి గోవిందా,లంచాలే రాజ్యమేలాయని,దళితులపై ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించారని,అందుకే నియోజకవర్గ ప్రజలు రేగాకు తగిన బుద్ధి చెప్పారన్నారు.అభివృద్ధి సంక్షేమం దిశగా పినపాక నియోజకవర్గంను ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే పాయంపై ఆరోపణలు చేస్తూ,కళ్ళున్నా చూడలేని కబోతుల్లా తయారయ్యారని విమర్శించారు.ప్రజాక్షేత్రంలో ప్రశ్నించడం చేతకాక సోషల్ మీడియాలో కారుకూతలు కూయడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదని,ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు