మనన్యూస్,నారాయణ పేట:జిల్లా కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ భవనం ను శుక్రవారం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.జర్నలిస్టులు తమ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే విధంగా కృషి చేయాలని అన్నారు.సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ,జిల్లా కేంద్రంలో ఉన్న రిపోర్టర్స్ కి ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడంతో దిక్కుకు ఒకరు ఉన్నట్టుగా ఉండేవారని అన్నారు.నేడు ప్రెస్ క్లబ్ భవనం ఓపెన్ చేసుకోవడం ద్వారా తమకు సంతోషం కలిగిందని,ఇక పైన ఏ కార్యక్రమాలు ఉన్న క్లబ్ భవనంలో నిర్వహించుకుంటనని వర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు