మనన్యూస్,కామారెడ్డి:కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ని అదనపు కలెక్టర్ వి. విక్టర్ ఆవిష్కరించారు సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బాపురావు,జిల్లా అధ్యక్షులు ప్రసాద్, మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారన్నారు.తెలంగాణ పోరాటంలో ప్రజలను నాయకులను ఏకం చేసి రాష్ట్ర సాధనకు సైతం కృషి చేశారన్నారు.అన్ని వర్గాలను ప్రజల ను మమేకం చేస్తూ ప్రజల కోసం నిరంతరం ఐఎఫ్ డబ్ల్యూ జె అనుబంధంతో టీజేయు జర్నలిస్ట్ యూనియన్ కొనసాగుతుందన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చేతుల మీదుగా 2025 సంవత్సర డైరీ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమం లో జిల్లా యూనియన్ సభ్యులు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సంకి నారాయణ,గోపాల్,శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి,రవి నాయక్,పాల్గొన్నారు.