ఐరాల ఫిబ్రవరి 19 మన న్యూస్
ప్రముఖ అంబేడ్కరిస్ట్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత డా.పెదపూడి విజయకుమార్ మొట్టమొదటి సారి గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేయు సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మరియు ఇతర సిబ్బందితో ఎస్సీ కార్పొరేషన్ లోన్లపై, ఇతర పథకాలపై సమీక్ష నిర్వహించునున్నారని జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో తెలిపారు. చైర్మన్ తో పాటు రాష్ట్ర డైరెక్టర్ పొన్న యుగంధర్ మరియు ఇతర డైరెక్టర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్బంగా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత సోదరులు,వివిధ సంఘాల నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతీ,యువకులు తప్పకుండా హాజరుకావాలని తెలియజేశారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జనసేనపార్టీ నుండి రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ విజయ్ కుమార్ గారికి జనసేన నాయకులు,జనసైనికులు, కార్యకర్తలు అందరూ ఆహ్వానం పలకాలని కోరారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళితుల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకురాబోతున్నారని,ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో తెలిపారు.