బంగారుపాళ్యం ఫిబ్రవరి 19 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తరించు యంత్రాలను 31మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు మాదిరిగానే రైతు సంఘాలు ఏర్పాటు కావాలని ఇప్పుడు ఈ సంఘాలకు కూడా బ్యాంకులలో రుణాలు మంజూరు చేస్తున్నారని కావున మగవారు కూడా సంఘాలను ఏర్పాటు చేసుకొని రుణాలు పొంది అభివృద్ధి చెందాలన్నారు.పశుసంవర్ధక శాఖ ఎడి మాట్లాడుతూ గడ్డి కత్తారించే ఒక యంత్రం ధర 33970 రూ అని రైతులు 20382రూ కడితే ప్రభుత్వం 13588రూ సబ్సిడీ ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీధర్, మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు,టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్,టిడిపి నాయకులు ఎన్ పి విక్రమ్,ఎన్.పి.ధరణి,మండల రైతు సంఘం అధ్యక్షుడు నేతాజీ నాయుడు,జనార్దన్ గౌడ్,తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు,జాకీర్, నీరాజాక్షులు గౌడ్,తిరుమల నాయుడు,గోపాల్ నాయుడు,గురుస్వామి యాదవ్,పశుసంవర్ధక శాఖ సిబ్బంది,పాడి రైతులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.