తవణంపల్లి ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 19.
చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం దిగువ తడకర గ్రామ సమీపంలో బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి వారికి అందిన సమాచారం మేరకు మామిడి తోపులో ముగ్గురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా, వారిని పట్టుకోవడం జరిగినది. సదరు వ్యక్తుల వ్యక్తుల నుండి 4600-00 రూపాయల డబ్బు ఒక ఆటో స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. పేకాట ఆడుతుండగా పట్టుబడిన వారిలో 1.డి.కొండయ్య, వయస్సు 54 సంవత్సరాలు, తండ్రి (లేట్) దుర్గయ్య దిగువ తడకర గ్రామం.2. టి. మహేష్ వయసు 38 సంవత్సరాలు తండ్రి (లేట్) డి. గణేష్ దిగివతడకర గ్రామం.3. ఎన్ విశ్వనాథన్ వయసు 31 సంవత్సరములు (తండ్రి) సుధాకర్ అరగొండ హరిజనవాడ, ముగ్గురు వ్యక్తులు తవణంపల్లి మండలానికి చెందినవారుగా తెలిపారు. వీరిని త్వరలో కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.కార్యక్రమంలో కానిస్టేబుల్ వినయ్ కుమార్ రెడ్డి, సతీష్ కుమార్, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.