చిత్తూరు ఫిబ్రవరి 19 మన న్యూస్
ఏపీ యుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చిత్తూరు జిల్లాకు చెందిన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు లోకనాథన్, కార్యదర్శి మురళీకృష్ణ, బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టుగా కొనసాగుతూ చిత్తూరులోని సిటీ కేబుల్ జర్నలిస్టుగా ఉన్న స్థానిక తవణంపల్లి మండలానికి చెందిన అశోక్ కుమార్ ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు సైతం మరియు తవణంపల్లి మండలానికి చెందిన పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.