మనన్యూస్,కామారెడ్డి:మోడల్ స్కూల్ సదాశినగర్ బుధవారం బాలిక సాధికారిత క్లబ్ నిర్వహించిన లీగల్ లిట్రసి చట్టపరమైన అక్షరాస్యత పైన తోట రాకేష్ అనే న్యాయవాది బాలికల కొరకు న్యాయపరమైన చట్టాలను క్లుప్తంగా పిల్లలకి వివరించడం జరిగింది .అందులో ముఖ్యంగా ఫోక్సో యాక్ట్,బాల కార్మికుల చట్టం,బాల్యవివాహ నిరోధక చట్టం,నిర్భయ చట్టం,బాలల హక్కులు,ఫుడ్ సెక్యూరిటీ యాక్ట మరియు రాజ్యాంగంలో బాలికల కోసం పొందుపరిచిన కొన్ని ఆర్టికల్స్‌ను అందులో ముఖ్యంగా విద్యా హక్కు చట్టాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది.పిల్లలు కూడా చాలా శ్రద్ధగా వినడం జరిగినది ఇందులో బాలిక సాధికారిక క్లబ్ చైర్మన్ ప్రిన్సిపాల్ బాలిక సాధికారిక క్లబ్ కన్వీనర్ లక్ష్మి మేడం ఉపాధ్యాయులు సురేందర్ గారు మరియుశ్రీకాంత్ గారు పాల్గొనడం జరిగింది.