మనన్యూస్,పినపాక:నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో పాల్గొని చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ భవాని దేవి భక్తుడు భారతదేశ రక్షకుడు వీర శివాజీ పరమత సహనం కలిగిన దేశ వ్యతిరేకులకు సింహస్వప్నం లాంటి వారని మీ రక్తాన్ని ధార పోయండి మీకు దేశ ద్రోహుల నుంచి విముక్తి కలిగిస్తానని శివాజీ అన్నారని చత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ టౌన్ అధ్యక్షులు శివ సైదులు మహిళ మండల అధ్యక్షులు సౌజన్య మణుగూరు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు