తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్
తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి రోడ్డు మార్గం నందు మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వారిని తవణంపల్లి ఎస్సై చిరంజీవి సెకండ్ క్లాస్ కోర్టులో హాజరు పరచడం జరిగింది. అనంతరం వాహనదారులకు 10000 రూ. జరిమానా విధించడం జరిగింది. అలాగే బహిరంగ ప్రదేశాలలో గుంపులుగా కూర్చుని పద్యం సేవించిన 13 మంది వ్యక్తులకు, సెకండ్ క్లాస్ కోర్టు నందు జరిమానా విధించడం జరిగింది. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా మద్యం సేవించి వాహనం నడిపినచో, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినచో వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి ఆదేశాలు జారీ చేశారు.