మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో గల అవంతి ప్రవీణ్ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్న పెద్దనాపల్లి గ్రామానికి చెందిన మోర్తా సుదర్శన రావు. మంగళవారం మృతి చెందడంతో మృతదేహంతో కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అవంతి ఫ్రూజన్ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్న సుదర్శన రావు సూపర్వైజర్ చెప్పిన పనిలో భాగంగా ఈగలకు దోమలకు పెట్టే మందు బాటిల్ తీసుకురమ్మని పంపించగా ప్రమాదవశాత్తు స్తంభానికి గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి గురైన వ్యక్తిని కనీసం కంపెనీ యాజమాన్యం వారికి సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లకుండా తక్షణ చికిత్సను అందించకుండా వ్యవహరించడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించే సమయంలో మంగళవారం వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్దనాపల్లి గ్రామస్తులు వారి కుటుంబసభ్యులు గ్రామ పెద్దలంతా కలిసి అవంతి ప్రోజెన్ ఫుడ్స కంపెనీ ఆవరణలోనే నిరసన చేపట్టారు. అవంతి కంపెనీ యాజమాన్యం దిగివచ్చి మృతుని కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.