మనన్యూస్,కామారెడ్డి,మాచారెడ్డి: సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనిల్,వాహనాల తనిఖీలో భాగంగా ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు,ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ మాచారెడ్డి మండల ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలియజేశారు మండల ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.