మన న్యూస్, ఎస్ఆర్ పురం :-
ఎస్ఆర్ పురం మండలం దిగువమంగుంట గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కృపాలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మనీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు గురువారెడ్డి మాజీ మండల కన్వీనర్ అనంత రెడ్డి జెడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి స్థానిక సర్పంచ్ రూప శేషాద్రి ఎంపీపీ సరిత, జిల్లా వైఎస్ఆర్సిపి కార్య నిర్వాహక కార్యదర్శి విజయబాబు, నియోజకవర్గ కల్చర్ యాక్టివిటీ అధ్యక్షులు మనీ, నాయకులు జనార్ధన్ కుప్పయ్య కోటిరెడ్డి బాబు సర్పంచ్ చిట్టి మహేష్, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.