మనన్యూస్,జోగులాంబ.గద్వాల:గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి స్వామివారి కల్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించారు.వేద పండితుల వేదమంత్రోచారణల మధ్య శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించగా అనేకమంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.దేవాలయ విచారణ కర్త ప్రభాకర్ రావు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా వేణుగోపాల చారి ఆధ్వర్యంలో స్వామివారి సంకీర్తనలు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు.