
తన సేవలు ఎన్నటికీ నిత్య నూతనమే!
వికలాంగుల కొరకు విసుగులేని పోరాటం
తన సేవలకు మరెవరు సాటిరారని అంటున్న ప్రజానీకం.
మహర్షి స్వచ్ఛంద సంస్థ పేరుతో సేవలు మరింత విస్తృతం
మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,పత్రికలు, ప్రజా సంఘాలు తన సేవకు ఇచ్చిన పేరును తన స్వచ్ఛంద సంస్థగా మార్చుకొని వికలాంగుల కొరకు తన నిస్వార్థ సేవలను అందిస్తున్నాడు పినపాక మండలానికి చెందిన తోలెం శ్రీనివాసరావు గత దశాబ్ద కాలం నుండి నిరుపేదలై కుటుంబానికి భారంగా,వికలాంగ స్థితిలో ఉన్న ఎందరో అభాగ్యులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సంప్రదించి,వారిని ఆదుకుంటున్నాడు ఏదో చిన్న సహాయం చేసి డబ్బాలు కొట్టుకునే ఈ రోజుల్లో,నిరంతరం అభాగ్యులకే తన సేవను అందిస్తున్నాడు శ్రీనివాసరావు.ఇటీవల కాలంలో తన సేవలను మరింత అంకిత భావంతో తన మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నాడు మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ కాళ్లు అమర్చడం,శస్త్ర చికిత్సలు చేయించడం తమ విధి నిర్వహణలో భాగమై ఉంది.దీనిలో భాగంగా విజయవాడ కు చెందిన శ్రీనివాసరావు-కస్తూరి దంపతుల సహకారంతో విజయవాడలోని వికలాంగుల పునరావాస కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన సోంబోయిన పిచ్చయ్యకు ప్రమాదవశాత్తు ఆరు నెలల క్రితం కోల్పోయిన రెండు కాళ్ళకు కృత్రిమ కాలు అమర్చడం జరిగినది.నిన్నటి వరకు వికలాంగులుగా ఉండి కుటుంబానికి భారంగా ఉన్న పిచ్చయ్య, నేటి నుండి సాధారణ వ్యక్తిగా మారడంతో పిచ్చయ్య కుటుంబ సభ్యులు తోలెం శ్రీనివాసరావు చేసిన సహాయానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని,తను చేసిన ఈ సహాయాన్ని ఎన్నటికీ మరచిపోలేమని తెలియజేశారు.స్వచ్ఛందంగా మహర్షి సంస్థను స్థాపించిన శ్రీనివాసరావు వ్యక్తిత్వాన్ని పలువురు కొనియాడుతున్నారు.