మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం రాయిగుడ్డి వలస రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రాయి గుడ్డి వలస,నీలం వలస,సరాయివలస గ్రామాల రైతులకు నూనె గింజల పంటలపై అవగాహన కొరకు పార్వతీపురం,సీతానగరం మండలాల్లో గల నూనె గింజల పంటల క్షేత్రాలు సందర్శన సోమవారం నాడు జరిగింది.నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పథకంలో భాగంగా సాంకేతిక సహాయకులు ప్రసన్నారాణి ఆధ్వర్యంలో వేరుశనగ నువ్వులు పొద్దు తిరుగుడు,ఆయిల్ పామ్,నిమ్మగడ్డి పంటల సాగు క్షేత్రాలను సందర్శించి సాగులో మెలకువలను రైతులకు వివరించడం జరిగింది రైతులు నిమ్మగడ్డి క్షేత్రాలను మరియు నిమ్మ గడ్డి నూనె తీసే యంత్రాలను ఆసక్తిగా తిలకించారు.పై పంటల సాగు తో పాటు వాటి ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు.పంటల వలన రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అనేది అవగాహన కల్పించారు.రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసే అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు జిల్లా వ్యవసాయ కార్యాలయం విస్తరణాధికారి బాబ్జి గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ గ్రామ ఉద్యాన సహాయకులు ప్రియ మరియు రైతులు పాల్గొన్నారు.