మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,తెలంగాణ సాధనకై పోరాడి పట్టువిడని విక్రమార్కుడిలా తెలంగాణ వచ్చే విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి కేకును కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించి పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి,వైస్ చైర్మన్ గుమస్తా శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ హైమద్ హుస్సేన్,నాయకులు విఠల్ రెడ్డి,యటకారి నారాయణ,పిట్ల సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి,విజయ్,బాబు సెట్, కమ్మరి కథ అంజయ్య,తదితరులు ఉన్నారు.