మన న్యూస్,ఎస్ఆర్ పురం:-కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వం ప్రజలకు ఏ అవసరం వచ్చిన వాట్సప్ ద్వారా సమస్య తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు ఆదివారం ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ప్రభుత్వ విప్ అయిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పుల్లూరు సర్పంచ్ భవ్య పవన్ మండల అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వి.ఎం థామస్ రాష్ట్ర మాల కార్పొరేషన్ సభ్యులు గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ పాల్గొన్నారు వీరికి జనసేన పార్టీ శ్రేణులు గజమాల తో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా నంబర్ కు మీ సమస్య తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని చెప్పింది నేను నేడు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నాడు వాట్సప్ గవర్నర్ ని తీసుకొచ్చారని అన్నారు అధికారం వచ్చిన వెంటనే పేపర్ మీది పెన్ను మీది అనే సిద్ధాంతంతో ఎక్కడ ఏ సమస్యకు అర్జీలు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రెండు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నారు గ్రామాల్లో సి.సి రోడ్లు డ్రైనేజీలు నిర్మించి అభివృద్ధి చేస్తామని అన్నారు అదేవిధంగా పుల్లూరు క్రాస్ రోడ్ నుండి పుల్లూరు వరకు డబుల్ రోడ్డు మంజూరు. చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండయ్య, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు లోకనాథం రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసేన యువ నాయకుడు సుమన్, మాజీ సర్పంచ్ కుప్పయ్య, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్, దాము, అనిల్ ,లోకేష్, నాయకులు చంద్రబాబు రెడ్డి, చందు చార్లెస్ ,బాలరాజు, టిడిపి జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, హరీష్ యాదవ్, టిడిపి మండల ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, వెదురుకుప్పం మండల అధ్యక్షులు లోకనాథం రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి, గురునాథం ,మధు, రాజా, ఆరు మండలాల టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.