మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:పినపాక మండల కేంద్రంలో ఆదివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సమావేశ నిర్వహించారు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పాల్గొని,మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70ఎల్.టి.ఆర్ చుట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 ని ప్రత్యేక చట్టం చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో మహిళ ఇసుక ర్యాంపులలో గిరిజనేతరులు పెత్తనం అరికట్టాలని,సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని లంబాడాలకు ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.అనంతరం వీరి అధ్యక్షతన పినపాక మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.పినపాక మండల అధ్యక్షులుగా పడిగా అశోక్,ప్రధాన కార్యదర్శి పడిగ వీరభద్రం,ఉపాధ్యక్షులు ఇర్ప సంపత్,వాగు బోయిన శివ,గౌర అధ్యక్షులు కలేటి సునీల్ కుమార్,కోశాధికారి పూనెం సురేష్,జాయింట్ సెక్రెటరీ సోడే శాంతారావు, ఇర్ప శివకృష్ణ,కార్యదర్శులు వాగుబోయిన పవన్ కళ్యాణ్,కోర్స గణేష్,వాగుబోయిన ప్రకాష్,పడిగా అజయ్,గొంది దిలీప్ పడిగా కార్తీక్,పాయం నవేందర్,పడిగా ప్రకాష్,రేగ వెంకటేశ్వర్లు,ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో మణుగూరు మండల అధ్యక్షులు సోలం హరి శంకర్ కార్యదర్శులు గొగ్గల కోటి,కంగాల ప్రవీణ్,మడకం ప్రసాద్,గని బోయిన నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.